Muthineni Veeraiah | కాంగ్రెస్ హామీతోనే దివ్యాంగుల పింఛన్ పెంచిన కేసీఆర్‌: ముత్తినేని వీరయ్య

Muthineni Veeraiah సంక్షేమంపై చర్చకు రావాలంటు సవాల్‌ పీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య విధాత,కాంగ్రెస్ ఇచ్చిన నాలుగువేల పింఛన్ హామీకి ప్రతిస్పందనగానే సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను 4016 కి పెంచారని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం పోరాట ఫలితమేనని పీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. బడ్జెట్ లో 5శాతం వికలాంగులకు రావాలని దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చెపుతోందని, ఆ లెక్క ప్రకారం రూ.16వేల25 రూపాయల […]

  • Publish Date - July 24, 2023 / 01:04 AM IST

Muthineni Veeraiah

  • సంక్షేమంపై చర్చకు రావాలంటు సవాల్‌
  • పీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య

విధాత,కాంగ్రెస్ ఇచ్చిన నాలుగువేల పింఛన్ హామీకి ప్రతిస్పందనగానే సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను 4016 కి పెంచారని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం పోరాట ఫలితమేనని పీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. బడ్జెట్ లో 5శాతం వికలాంగులకు రావాలని దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చెపుతోందని, ఆ లెక్క ప్రకారం రూ.16వేల25 రూపాయల 64 పైసలు పెన్షన్ రావాలి కానీ రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10లక్షల 46 వేల 822 మంది దివ్యాంగులు ఉన్నారన్నారు.

కాగా.. ఆ లెక్కలు చూస్తే దాదాపు 13 లక్షల మంది ఉండే అవకాశముండేదని, అప్పుడు 7 రకాల దివ్యాంగులుండగా, ఇప్పుడు 14రకాలు పెరిగి 21రకాల దివ్యాంగులు ఉన్నారన్నారు. ఈ లెక్క ప్రకారం మరో 4లక్షల మంది పెరిగే అవకాశం అంటే దాదాపు 16 నుంచి 17లక్షల మందికి పెరిగారని, అందులో ప్రభుత్వం 5లక్షల మందికి పింఛన్ ఇస్తే మరో 11 లక్షల మంది ఎటు పోయినట్లని, అంటే 1/3 వంతు మందికి మాత్రమే పించన్ వస్తుందన్నారు. అందుకే దివ్యాంగుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ను బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నామన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక దివ్యాంగుల సంక్షేమ శాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలినం చేసి, కాంగ్రెస్ పార్టీ, దివ్యాంగుల జేఏసీల ఉద్యమాలతో విలీనము రద్దు చేసిన నీచపు చరిత్ర కేసిఆర్ దేనని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ పథకం క్రింద దివ్యాంగులకు 150రోజులు పని కల్పించాలి 25%పెంచి ఇవ్వాలి కానీ ఈ కేసిఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఇంతవరకు ఒక్క దివ్యాంగుడికి కూడా 150రోజులు కల్పించలేదన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దివ్యాంగుల మోటరైజ్డ్ వెహికల్ సబ్సిడీ 500రూపాయలను సైతం కేసీఆర్ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. 2014ఎన్నికలలో జిల్లాకో దివ్యాంగుల స్టడీ సర్కిల్ ఎర్పాటు చేస్తా అన్న ప్రభుత్వం చేయకపోగా, కాంగ్రెస్ ఎర్పాటు చేసిన హైద్రాబాద్ లో ఉన్న దివ్యాంగుల స్టడీ సర్కిల్ మూసి వేసిందన్నారు. గృహ లక్ష్మి పథకం లో దివ్యాంగులు అనే పదం లేదని, అన్నీ సంక్షేమ పథకాలు లో 5%కేటాయించాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన జీవో నీ ఈ ప్రభుత్వమే తుంగలో తొక్కిందన్నారు.

దళిత బంధులో దళిత దివ్యాంగులకు 5%కేటాయించాలి, 25% లబ్ధి పెంచి ఇవ్వాలి కానీ ఆ ఉసే లేదన్నారు. దివ్యాంగులకు ఉన్న 75 కి పైగా సంక్షేమ జీవోలని కేసీఆర్ ప్రభుత్వం తొక్కి పెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు తాత్కాలిక సర్టిఫికేట్ ఇచ్చి సగానికి పైగా పింఛన్‌లను తొలగిస్తున్నారన్నారు. సర్టిఫికెట్ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గత 9 సంవత్సరాలుగా దివ్యాంగుల దినోత్సవంకు ఏనాడు హాజరు కాని సీఎం కేసీఆర్ ఒక్కడేనన్నారు. కేసీఆర్ చెప్పిన దివ్యాంగుల హెల్త్‌ కార్డు ఎటుపోయిందో చెప్పాలని నిలదీశారు.

Latest News