Site icon vidhaatha

NIA Raids | ఏడు రాష్ట్రాల్లో 70 చోట్ల ఎన్‌ఐఏ దాడులు..

NIA raids | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం ఉదయం ఏడు రాష్ట్రాల్లోని దాదాపు 70చోట్లకుపైగా దాడులు చేసింది. గ్యాంగ్‌స్టర్‌, క్రైమ్‌ సిండికేట్‌కు సంబంధించిన కేసులో దాడులు నిర్వహించింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. అంతేకాకుండా ఢిల్లీ, చండీగఢ్‌లోనూ సోదాలు జరుపుతున్నది. దీంతో పాటు గుజరాత్‌లో కూడా ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు కుల్విందర్ గాంధీధామ్ ప్రాంగణంలో దాడులు ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్న బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు ఆశ్రయం కల్పించినట్లు కుల్విందర్‌పై ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో కుల్విందర్‌కు సంబంధాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Exit mobile version