Site icon vidhaatha

Notification: తెలంగాణలో 607అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

విధాత, హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం వైద్య,ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ అండ్ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. జులై 10 నుంచి 17వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జోన్ 1 పరిధిలో 379, జోన్ 2 పరిధితలో 228ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూలై 18,19తేదీల్లో దరఖాస్తుల ఎడిట్ కోసం ఆప్షన్ ఇచ్చారు. దరఖాస్తుదారులు పోస్టుల వారిగీ ఆన్ లైన్ ఆర్జీలు పెట్టాలని సూచించారు. ఈ పోస్టులకు యూజీసీ గైడ్ లైన్ మేరకు రూ.68.900నుంచి రూ.2,05,500మధ్య వేతనం ఉండనుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్‌, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1,931 మల్టీపర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా.. మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తుండటం గమనార్హం.

Exit mobile version