NTR | ఖమ్మం NTR విగ్రహం తెచ్చిన తంటా.. కరాటే కళ్యాణి ‘మా’ సభ్యత్వం రద్దు

NTR | విధాత: సినీ నటి కరాటే కల్యాణికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. గతంలో తాము ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందుకు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో NTR 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపోశారు. అయితే NTR కృష్ణుడి […]

  • Publish Date - May 26, 2023 / 09:41 AM IST

NTR |

విధాత: సినీ నటి కరాటే కల్యాణికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. గతంలో తాము ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందుకు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు.

నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో NTR 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపోశారు. అయితే NTR కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మే 28వ తేదీన ఆ విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. దీనికి జూనియర్ NTRను సైతం ఆహ్వానించారు.

అయితే ఆ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ప్రతిష్టించడం సమంజసం కాదని, ఆయన దేవుడు కాదు అంటూ ఆమె ఆరోపించారు. NTR విగ్రహం పెట్టుకోండి కానీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయవద్దని ఆమె డిమాండ్ చేయగా దీనికి యాదవ సంఘాలు సైతం జత కలిశాయి దీంతో ఈ విగ్రహం అంశం కాస్త వివాదాస్పదం అయింది.

ఈ వివాదం మీద మంచు విష్ణు ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా ఆమె ఆగకుండా ఈ విగ్రహావిష్కరణ జరగకూడదంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో ఆ విగ్రహంలోని కృష్ణుడి తల మీద ఉన్న నెమలి పింఛం.. చేతిలోని మురళిని తీసేసి మార్పులతో ప్రతిష్టించుకోవాలి అని కోర్టు సూచించింది.

ఈ అంశం మొత్తానికి పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఆ గొడవకు కరాటే కళ్యాణి కారణం అని, తామిచ్చిన నోటీసును సైతం లెక్క చేయకపోగా కోర్టుకు వెళ్లడాన్ని మా తీవ్రంగా పరిగణించి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తెలిసింది

Latest News