విధాత, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్, రేపిడో నడుపుతున్న ఆటో రిక్షాల ఛార్జీలు విపరీతంగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. లైసెన్స్ లేని ఆటో రిక్షా రైడ్స్‌ను మూడు రోజుల్లోగా నిలిపేయాలని, లేదంటే చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని ఈ సంస్థలకు గురువారం నోటీసులిచ్చింది.