Site icon vidhaatha

Reservation | కాంట్రాక్టు ఉద్యోగాల్లోనూ రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే

Reservation | విధాత‌: ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో అమ‌లు చేస్తున్న రిజ‌ర్వేష‌న్ల‌ను కాంట్రాక్టు ఉద్యోగాల్లో కూడా అమ‌లు చేయాల‌ని పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం సిఫార‌సు చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమంపై అధ్య‌య‌నం చేసిన పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం ఈ అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడ‌బ్ల్యుఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను కాంట్రాక్టు ఉద్యోగాల్లో కూడా అమ‌లు చేయాల‌ని స్థాయీ సంఘం సూచించింది. మంత్రిత్వ శాఖ‌లు, ప్ర‌భుత్వ విభాగాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వ శాఖ‌లు, స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌ల్లో నియ‌మించే కాంట్రాక్టు ఉద్యోగాల‌న్నింటా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని స్థాయీ సంఘం సూచించింది.

రిజ‌ర్వేష‌ను విధానం రూప‌క‌ల్ప‌న‌, అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ పాత్ర అన్న అంశంపై రూపొందించిన నివేదిక‌లో స్థాయీ సంఘం ఈ సూచ‌న‌లు చేసింది.

ప్ర‌భుత్వం నుంచి గ్రాంటులు తీసుకునే ప్రైవేటు కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు, పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో కూడా ఈ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసే విష‌య‌మై ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని వెల్ల‌డించాల‌ని స్థాయీ సంఘం కోరింది. బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకీ అధ్య‌క్ష‌త‌న ఏర్ప‌డిన ఈ స్థాయీ సంఘం ఇటీవ‌ల ఈ నివేదిక‌ను పార్ల‌మెంటుకు స‌మ‌ర్పించింది.

Exit mobile version