Site icon vidhaatha

Kaleru Venkatesh | ఆ ఎంపీ యూటర్న్‌.. కాంగ్రెస్‌కు షాక్‌

పెద్దపల్లి ఎంపీ మళ్లీ పార్టీ మార్పు

విధాత : పార్లమెంటు ఎన్నికల వేళ వలస నేతల రాకతో సందడిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎంపీ యూటర్న్ షాక్ నిస్తుంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సిటింగ్ ఎంపీ కాలేరు వెంకటేష్ నేత ఆ పార్టీ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌లో మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అటు బీజేపీ సైతం ఇప్పటికే తమ పార్టీ పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించింది.

వెంకటేష్ నేత పార్టీలో చేరితే గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం ఉందని గట్టి ప్రచారం వినిపిస్తుంది. బోర్లకుంట వెంకటేశ్‌ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప బీఆరెస్ ప్రత్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

అనంతరం 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆరెస్‌లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఇటీవల ఫిబ్రవరి మొదటి వారంలో బీఆరెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టేందుకు సిద్ధపడ్డారు.

Exit mobile version