Site icon vidhaatha

High Court: సమాచార కమిషనర్ల భర్తీకై హైకోర్టులో పిల్

విధాత: తెలంగాణ రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఖాళీల భర్తీ కోరుతూ హైకోర్టులో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. సమాచార కమిషన్‌లో కమిషనర్లు అందరూ రిటైర్ కావడంతో కమిషన్ స్తంభించిపోయిందని, సత్వరమే కమిషనర్ల నియామకం చేపట్టాలంటూ పిల్ దాఖలైంది.

సమాచార కమిషన్‌లో ప్రస్తుతం 9,244 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కమిషన్ పని చేయకపోవడంతో పాలనలో పారదర్శకత, జవాబుదారితనం లోపించి అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌లో పేర్కొంది.

Exit mobile version