Site icon vidhaatha

Pilli Subhash Chandra Bose | మంత్రి వేణుతో వివాదం సద్దుమణిగింది: ఎంపీ బోస్‌

Pilli Subhash Chandra Bose

విధాత: మంత్రి వేణుకు, ఎంపీ బోస్‌లకు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. అధిష్టానం మందలింపుతో వెనక్కి తగ్గిన ఎంపీ బోస్, తనయుడు సూర్య ప్రకాష్ లు ప్రెస్‌మీట్ పెట్టి వివాదానికి తెరవేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంపీ బోస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి వేణుతో నెలకొన్న వివాదం సద్దుమణిగిందన్నారు.

కార్యకర్తల ఇబ్బందులు, మనోభావాలు దృష్టిలో పెట్టుకునే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నానని ఇందుకు క్షమించాలన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలవైపు పెళ్లే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపే బాధ్యత నాపై ఉందని, అందుకే రాజీనామా చేస్తానన్నానని చెప్పుకున్నారు.

సీఎం జగన్‌కి అన్ని విషయాలు వివరించామని, సర్వే చేయించి మంచి నిర్ణయం తీసుకుంటాను అని సీఎం హామీ ఇచ్చారన్నారు. గిరి గిసుకుని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూర్చోడని, మా పని మేము చేసుకుంటాం మంత్రి పని ఆయన చేసుకుంటారన్నారు. పార్టీలో పని చేయడానికి నిబంధనలు ఎవరికి ఏమి లేవని, సీఎం జగన్ ఇప్పటికే సర్వే బృందాలు దించారని, సర్వే నివేదికల ఆధారంగా టికెట్ కేటాయింపు ఉంటుందన్నారు.

Exit mobile version