Site icon vidhaatha

ఐదేళ్ల‌లోనే 20 ఏళ్ల కంటే అధికంగా చేసి చూపించాం

ఇటాన‌గర్‌: కాంగ్రెస్ 20 ఏళ్ల‌లో చేసిన దానికంటే తాము ఐదేళ్ల‌లోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది చేసి చూపించామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. శనివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ లో రూ. 55, 600 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన సంద‌ర్భంగా ఇటానగర్ లో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల‌ అభివృద్ధి కోసం తాము అహర్నిశలు పాటు పడ్డామన్నారు.


ఈశాన్యంలో బలమైన వ్యాపార సంబంధాలు పెంపొందింపజేసి, టూరిజం తదితర అవకాశాలను ఉపయోగించుకొని, దీన్ని దక్షిణాసియాకు, తూర్పు ఆసియాకు బలమైన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. మా ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే, ప్రతిపక్షమైన ఇండియా మా పైన దాడి చేస్తుందని ఆయన ఆరోపించారు.

Exit mobile version