RBI | మార‌ని రెపో రేట్..6.5 శాత‌మే: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్‌

RBI విధాత‌: ఆర్థిక‌వేత్త‌లు, భార‌త రిజ‌ర్వు బ్యాంకు మానిట‌రీ పాల‌సీ క‌మిటీ(MPC) రెపొరేటు ప్ర‌స్థుతం 6.50 శాతం ఉండ‌గా 2024 ఆర్థిక‌ సంవ‌త్స‌రంలో కూడా ఏ మార్పులు లేకుండా ఉంటుంద‌ని వెల్ల‌డించారు. మానిట‌రీ పాల‌సీ క‌మిటీ(MPC) మూడు రోజులు నిర్వ‌హించిన చ‌ర్చ‌ల త‌రువాత ప్ర‌స్థుతం ఉన్న రెపొ రేటునే కొన‌సాగిస్తున్న‌ట్లు ఏక‌గ్రీవంగా వెల్ల‌డించిన‌ట్లు రిజ‌ర్వు బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ గురువారం తెలిపారు. శ‌క్తికాంత దాస్ ఆర్థిక అంశాల గురించి వెల్ల‌డిస్తూ.. 2024 ఆర్థిక సంవ‌త్స‌రంలో స్థూల […]

  • Publish Date - August 10, 2023 / 12:34 PM IST

RBI

విధాత‌: ఆర్థిక‌వేత్త‌లు, భార‌త రిజ‌ర్వు బ్యాంకు మానిట‌రీ పాల‌సీ క‌మిటీ(MPC) రెపొరేటు ప్ర‌స్థుతం 6.50 శాతం ఉండ‌గా 2024 ఆర్థిక‌ సంవ‌త్స‌రంలో కూడా ఏ మార్పులు లేకుండా ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

మానిట‌రీ పాల‌సీ క‌మిటీ(MPC) మూడు రోజులు నిర్వ‌హించిన చ‌ర్చ‌ల త‌రువాత ప్ర‌స్థుతం ఉన్న రెపొ రేటునే కొన‌సాగిస్తున్న‌ట్లు ఏక‌గ్రీవంగా వెల్ల‌డించిన‌ట్లు రిజ‌ర్వు బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ గురువారం తెలిపారు.

శ‌క్తికాంత దాస్ ఆర్థిక అంశాల గురించి వెల్ల‌డిస్తూ.. 2024 ఆర్థిక సంవ‌త్స‌రంలో స్థూల దేశీయోత్ప‌త్తి (GDP) 6.5 శాతం వృద్ధి చెందే అవ‌కాశం ఉన్న‌ట్లు మానిట‌రీ పాల‌సీ క‌మిటి (MPC) పేర్కొంద‌న్నారు.

వివిధ ర‌కాల అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని MPC వేసిన లెక్కల‌ ప్ర‌కారం 2023-24 సంవ‌త్స‌రంలో 5.4 శాతంమేన‌ని తెలిపారు.

రాజ‌కీయ ప‌రిస్థితులు, రుతుప‌వ‌నాలు వంటి ప‌లు అంశాల మేర‌కు ద్ర‌వ్యోల్బ‌నం వృద్ధి చెంద‌టంలేద‌ని తెలిపారు. అయితే మానిట‌రీ పాల‌సీ క‌మిటీ (MPC) స‌మావేశాలు ఆగ‌స్టు 8, 9, 10 అగ‌స్ట్‌నెల‌లో జ‌రిగాయి.

Latest News