విధాత, ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కమిషనరేట్ విభాగంలోని రుద్రమ ఉమెన్స్ పోలీస్ స్పెషల్ ఫోర్స్ విభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాలతో మొట్టమొదటి సారిగా ఈ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగం ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫోర్స్ చేసిన విన్యాసాలు, శిక్షణపొందిన అంశాలను ప్రదర్శించారు. సిబ్బంది తమ కళ్ళకు గంతలు కట్టుకొని వారికి ఇచ్చిన అయుధాలను విడదీయడం, తిరిగి వాటిని జోడించడం లాంటి విన్యాసాలను ప్రదర్శించారు. ఇవన్నీ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ విభాగంలో పనిచేసే మహిళలు పురుషులతో సమానంగా ప్రత్యేకంగా కంమాండో తరహలో శిక్షణ పూర్తి చేశారు. వీరికి అన్నిరకాల దేహదారుఢ్య శిక్షణ, అయుధ శిక్షణ ఇచ్చారు. ఈ ఫోర్స్ విభాగం మహిళా పోలీసుల పనితీరును పోలీస్ కమిషనర్ సింగ్ స్వయంగా పరిశీలించారు. రుద్రమ ఉమెన స్పెషల్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని ఆయన అభినందించి, వారికి రివార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనతీరు అభినందనీయమని అన్నారు. సిబ్బందికి అయుధాలపై వున్న పరిజ్ఞానం, వాటిని వినియోగించే పద్దతులు, సిబ్బంది నిర్వహించే అయుధ పరేడ్, వ్యాయామం,యోగా మొదలైనవి పరిశీలించిన ఈ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది క్షేత్ర స్థాయిలోనే రివార్డులను ప్రకటించారు. డాగ్ స్వ్కాడ్, బాంబ్ డిస్పోజబుల్, మోటార్, అయుధగారం విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు సురేష్‌కుమార్, శ్రీనివాస్,రవి, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా, ఏసిపిలు నాగయ్య, సురేంద్ర, ఆర్.ఐ స్పర్జన్ రాజ్, సతీష్,శ్రీధర్,చంద్రశేఖర్‌తో పాటు ఆర్.ఎస్.ఐలు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Guava | జామపండు తొక్కతో తినాలా.. లేక తొక్క లేకుండా తినాలా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
Budget 2026 | కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1నే ఎందుకు..? ఎప్పుడు మార్చారు..?
