Saaree Trailer:
విధాత: రామ్ గోపాల్‌వర్మ (RGV) నిర్మాణంలో కొత్తగా రూపొందుతున్న చిత్రం శారీ (Saaree). మూడు నాలుగేండ్ల క్రితం సోషల్ మీడియా రీల్స్‌తో ఫేమస్ అయిన కేరళ బ్యూటీ ఆరాధ్యదేవి (Aradhya Devi)ని కథానాయికగా పరిచయం అవుతోంది. గిరీశ్ కృష్ణ కమల్ (Giri Krishna Kamal) దర్శకత్వం వహించాడు. సత్య, సహిల్, కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ మూవీ టీజర్, పాటలు విడుదల చేయగా మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ అఖరికి ఏప్రిల్4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను చూస్తే ఇది కూడా ఓ సైకో కిల్లర్ చుట్టూ తిరిగే సినిమాలానే ఉంది.