<p>Ukraine కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఆ దేశ ప్రముఖ రచయిత్రి విక్టోరియా అమెలినా దుర్మరణం పాలయ్యారు. జులై 1న రష్యా ప్రయోగించిన క్షిపణి.. ఆమె ఉన్న రెస్టారెంట్‌పై పడింది. ఈ పేలుడులో ఆమె చనిపోయారు. ఆమె వయసు 37 ఏళ్లు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన క్రామ్‌టోస్క్ పట్టణంలోని రియో పిజ్జా రెస్టారెంట్‌పై మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీప దవాఖానకు తరలించారు. దాడి జరిగిన […]</p>
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఆ దేశ ప్రముఖ రచయిత్రి విక్టోరియా అమెలినా దుర్మరణం పాలయ్యారు. జులై 1న రష్యా ప్రయోగించిన క్షిపణి.. ఆమె ఉన్న రెస్టారెంట్‌పై పడింది. ఈ పేలుడులో ఆమె చనిపోయారు. ఆమె వయసు 37 ఏళ్లు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన క్రామ్‌టోస్క్ పట్టణంలోని రియో పిజ్జా రెస్టారెంట్‌పై మిస్సైల్ దాడి జరిగింది.
ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీప దవాఖానకు తరలించారు. దాడి జరిగిన సమయంలో ఆమె పలువురు కొలంబియా జర్నలిస్టులు, రచయితలతో కలిసి ఆ రెస్టారెంట్‌లో ఉన్నారు. ఈ దాడిలో అమెలినాతోపాటు 13 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు.
Candles, flowers and toys are displayed as part of a makeshift memorial for killed staff members of a restaurant destroyed in a recent missile strike, in the centre of Kramatorsk, on June 29, 2023, amid Russia’s military invasion on Ukraine. The toll from a Russian missile strike on a restaurant in eastern Ukraine rose to 12 dead and at least 60 wounded on June 28, 2023 morning, including children, as the Kremlin insisted Russian forces only hit military-linked targets. (Photo by Genya SAVILOV / AFP)
ప్రస్తుతం అమెలినా రష్యా యుద్ధ నేరాల పరిశోధన పత్రం తయారు చేసే పనిలో ఉన్నారు. 2017లో ఆమె ప్రచురించిన నవల డోమ్స్ డ్రీమ్ కింగ్ డమ్‌కు యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ బహుమతితో బాటు యూరోపియన్ యూనియన్ ఫార్ లిటరేచర్ బహుమతి కూడా పొందింది. ఆమె రాసిన అనేక కవితలు, పద్యాలు, వ్యాసాలు ఇంగ్లిష్, జర్మనీ, పోలిష్ భాషల్లోకి అనువాదమయ్యాయి