Russian passenger plane crashes | న్యూఢిల్లీ : రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్(Angara Airlines) ఏఎన్-24 విమానం(An-24 Aircraft) అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. 50 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన విమానం ముందుగా అదృశ్యమైనట్లుగా అధికారులు భావించారు. తర్వాత కొద్ధిసేపటికే విమానం గమ్యస్థానం టిండాకు(Tynda) 15కీలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లుగా గుర్తించారు. విమానంలో 43మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని..ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని రష్యన్ మీడియా వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్ చెన్స్క్(Blagoveshchensk) నుంచి టిండా బయలుదేరింది. రష్యా తూర్పు వైపున చైనా సరిహద్దు సమీపంలో ఉన్నట్టుండి ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.
టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సడన్‌గా రాడార్ నుంచి అదృశ్యమైన విమానం గమ్యస్థానంకు 15కిలోమీటర్ల సమీపంలో కూలిపోయినట్లుగా గుర్తించారు. విమానం మంటల్లో దగ్దమవుతుండగా..సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పైలట్ విమానాన్ని రెండుసార్లు ల్యాండింగ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై కూలిపోయిందని తెలుస్తుంది.
