సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు.. ఏయే మార్గాల్లో నడుస్తాయంటే..?

సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది

  • Publish Date - January 10, 2024 / 03:57 AM IST

Special Trains | సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే పలు రైళ్లను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో రద్దీ నెలకొన్నది. దీంతో మరిన్ని రైళ్లను తీసుకువచ్చింది. నేటి నుంచి 15 వరకు రైళ్లు వివిధ మార్గాల్లో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. తిరుపతి-సికింద్రాబాద్(07055) ఈ నెల బుధవారం (10న) నడువనున్నది.


సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07056) రైలు 11న, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07057) రైలు 12న, సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07071) రైలు 13న, కాకినాడ టౌన్-తిరుపతి (07072) 14న, తిరుపతి-కాచిగూడ (02707) ప్రత్యేక రైలు 15న పరుగులు తీయనున్నాయి. తిరుపతి-సికింద్రాబాద్ రైలు 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 9.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 11న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ రైలు సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు కాకినాడకు చేరుతుంది.


కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు 13న రాత్రి 9 గంటలకు, కాకినాడ టౌన్‌ – తిరుపతి రైలు ఉదయం 10 గంటలకు, తిరుపతి – కాచిగూడ స్పెషల్‌ ట్రైన్‌ ఉదయం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని రైల్వేశాఖ వివరించింది.