Gold Rate | వినియోగారులకు షాక్‌..! వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం ధర..!

Gold Rate | వినియోగదారులకు బంగారం ధరలు షాక్‌నిస్తున్నాయి. వరుస రెండోరోజూ ధరలు పెరిగాయి. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగి రూ.56,700కి చేరింది. 24 క్యారెట్ల తులం పసిడిపై రూ.100 పెరిగి.. రూ.61,850కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పసడి ధరలు పైకి కదిలాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,850కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.62వేల చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర […]

  • Publish Date - May 10, 2023 / 05:20 AM IST

Gold Rate | వినియోగదారులకు బంగారం ధరలు షాక్‌నిస్తున్నాయి. వరుస రెండోరోజూ ధరలు పెరిగాయి. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగి రూ.56,700కి చేరింది. 24 క్యారెట్ల తులం పసిడిపై రూ.100 పెరిగి.. రూ.61,850కి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో పసడి ధరలు పైకి కదిలాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,850కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.62వేల చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,700కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,850కు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,750కి పెరగ్గా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,900కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,700 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.61,850కి పెరిగింది.

చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,200కు పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,400 వద్ద ట్రేడవుతున్నది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82,500 వద్ద కొనసాగుతున్నది.

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2,036 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం మళ్లీ తలెత్తుతుందన్న ఆందోళనతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో రేట్లు అధికమవుతున్నాయి. ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు గోల్డ్‌ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Latest News