Site icon vidhaatha

T N Vamsha Tilak | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్‌. వంశతిలక్

విధాత: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్‌. వంశతిలక్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఉపఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అభ్యర్థిగా వంశతిలక్ పేరును ప్రకటించింది. ముగ్గురు పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు వంశతిలక్‌ను ఖరారు చేసింది.

ఇటీవల జరిగిన 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో బీఆరెస్ నుంచి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేస్తున్నారు. లాస్య నందిత అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది.

Exit mobile version