అల్పాహారం (Breakfast) మన శరీరానికి ఎంతో అవసరం. అయితే చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. సమయం లేకపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం వంటి కారణాలతో అల్పాహారాన్ని స్కిప్ చేసి డైరెక్ట్‌గా మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇలా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. ఇది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం తీసుకునే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అల్పాహారం మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది అలసట, చిరాకు, రోగనిరోధక శక్తి తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాలను పెంచుతుంది. రోజంతా శక్తివంతంగా ఉండాలంటే అల్పాహారం చాలా అవసరం. రోజువారీ అల్పాహారం తీసుకునే వారిలో కంటే.. బ్రేక్‌ఫాస్ట్ మానేసిన వారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బరువు కూడా పెరుగుతారట. చాలా మంది బరువు తగ్గేందుకు బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. అలా చేయడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా క్యాన్సర్ పడే ఛాన్స్ అధికం.
క్యాన్సర్ ప్రమాదం..
అల్పాహారం స్కిప్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా డైరెక్ట్‌గా లంచ్ చేస్తారు. అప్పుడు ఫుడ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. దీని వల్ల ఊబకాయం వస్తుంది. బరువు కూడా పెరుగుతారు. ఫలితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
మైగ్రేన్
ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. అల్పాహారం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. ఫలితంగా మైగ్రేన్, తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జుట్టు రాలిపోవడం..
అల్పహారం మానేయడం వల్ల వచ్చే ప్రధాన దుష్ప్రభావాల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. శరీరానికి తక్కువ స్థాయిలో ప్రోటీన్లు అందండం వల్ల కెరాటిన్‌పై ప్రభావంచూపుతుంది. ఇది జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.
గుండె జబ్బుల ప్రమాదం..
రోజువారీ అల్పహారం మానేస్తే గుండెజబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే గుండె జబ్బుల ముప్పు 17 శాతం ఉంటుందట. అదే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
అందుకే ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా ఉదయం పూట ఆరోగ్యకరమైన, పోషకాలు నిండిన అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలు (పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు) ఎంచుకోవడం మంచిది.
అల్పాహారం తీసుకోకపోతే కలిగే నష్టాలు ఇవే..
1. శరీరానికి అవసరమైన శక్తిని కోల్పోతాం.
2.ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోతాం.
3.ఏకాగ్రత కోల్పోతాం.
4.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి అలసట, చిరాకుకు దారితీస్తుంది.
5.గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది.
6.జీవక్రియపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది, బరువు పెరగడానికి కూడా కారణం కావొచ్చు.
ఇవి కూడా చదవండి :
Sunita Williams | అంతరిక్ష ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్.. ఆమె ప్రయాణం ఓ అద్భుతం.. సాహసం!
Rajamouli | కరోనా టైంలో చనిపోతానని అనుకున్నా.. కుటుంబమంతా ప్రమాదంలో పడింది
