Sharad Pawar
- 13-14 తేదీల్లో నిర్వహించే అవకాశం
- ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడి
ముంబై: విపక్షాల ఐక్యత విషయంలో మరింత లోతుగా చర్చించేందుకు జూలై 13-14 తేదీల్లో సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. ప్రతిపక్షాల తదుపరి సమావేశం బెంగళూరులో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
‘పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం తర్వాత మోదీకి అసహనానికి గురవుతున్నారు’ అని పవార్ వ్యాఖ్యానించారు. పాట్నా భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు తదుపరి సమావేశం సిమ్లాలో నిర్వహిస్తామని ప్రకటించారు.
ఆ సమావేశంలో బీజేపీని వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. అయితే.. ఈ సమావేశం షెడ్యూలు మారిన విషయాన్ని శరద్‌పవార్ మీడియాకు తెలిపారు