DK Shivakumar | సిద్ధ‌రామ‌య్య భ‌య‌ప‌డ్డారు.. కానీ నేనైతే.. డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

DK Shivakumar | క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధార‌మ‌య్య‌ను ఉద్దేశించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం, డిప్యూటీ సీఎం మ‌ధ్య బంధం బీట‌లు వారుతుంద‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి. బెంగ‌ళూరు న‌గ‌ర నిర్మాత కెంపేగౌడ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన డీకే శివ‌కుమార్ ప్ర‌సంగించారు. […]

  • Publish Date - June 28, 2023 / 01:18 AM IST

DK Shivakumar | క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధార‌మ‌య్య‌ను ఉద్దేశించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం, డిప్యూటీ సీఎం మ‌ధ్య బంధం బీట‌లు వారుతుంద‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి.

బెంగ‌ళూరు న‌గ‌ర నిర్మాత కెంపేగౌడ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన డీకే శివ‌కుమార్ ప్ర‌సంగించారు. న‌గ‌ర అభివృద్ధి కోసం ట‌న్నెల్స్, ఫ్లై ఓవ‌ర్లు నిర్మించాల‌ని చాలా మంది నుంచి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయి. అయితే అలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా స‌వాళ్లు ఎదుర‌వుతాయి అని చెబుతూ.. గ‌తంలో జ‌రిగిన ఓ స‌న్నివేశాన్ని డీకే గుర్తు చేశారు.

2017లో ఇలాగే బెంగ‌ళూరులో స్టీల్ ఫ్లై ఓవ‌ర్‌కు నిర్మించాల‌ని నాటి కాంగ్రెస్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అయితే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి తీవ్రంగా వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టారు. దీంతో నాటి సీఎం సిద్ధ‌రామ‌య్య‌, బెంగ‌ళూరు న‌గ‌రాభివృద్ధి శౄఖ మంత్రి కేజే జార్జ్ ఆందోళ‌న‌ల‌కు భ‌య‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. ఒక వేళ తానే ఆ స్థానంలో ఉంటే.. అలాంటి ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు త‌లొగ్గ‌కుండా, స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేప‌ట్టేవాడిన‌ని శివ‌కుమార్ తెలిపారు.

శివ‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే స్పందించారు. నాడు సిద్ధ‌రామ‌య్య భ‌య‌ప‌డ్డార‌ని తాను చెప్ప‌ను. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను గౌర‌వించి, వారితో సున్నితంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని సిద్ధ‌రామ‌య్య‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చి మంచి నిర్ణ‌యాలు తీసుకోవడం ఆలస్య‌మ‌వుతుంటుంది. ఆ ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించి ఉండొచ్చ‌ని ప్రియాంక్ ఖ‌ర్గే పేర్కొన్నారు.

ఇటీవ‌ల నిర్వ‌హించిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ముఖ్య‌మంత్రి పీఠం కోసం సిద్ధరామ‌య్య‌, శివ‌కుమార్ మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన్న విష‌యం విదిత‌మే. చివ‌ర‌కు అధిష్టానం నిర్ణ‌యం మేర‌కు డికే శివ‌కుమార్.. డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సిద్ధ‌రామ‌య్య రెండోసారి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

Latest News