Site icon vidhaatha

SLBC టన్నెల్ ప్రమాదం అతి క్లిష్టమైంది: ఉత్తమ్

విధాత: Slbc టన్నెల్ ప్రమాదం మరెక్కడా జరగనటువంటి క్లిష్టమైన ప్రమాదమని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టన్నెల్ వద్ధకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ పై ఉత్తమ్ సహాయక బృందాలు, సిబ్బందితో సమీక్ష చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రమాదం జరిగిన సొరంగం 14కిలోమీటర్లు ఉందని.. చివరి 50మీటర్లలో సహాయక చర్యలు చేపట్టడం క్లిష్టతరంగా ఉందన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తెప్పించిన కడవర్ డాగ్స్ మూడు స్పాట్లను గుర్తించాయని..అక్కడ తవ్వకాలు చేపట్టారన్నారు. జీరో పాయింట్ వద్ద చివరి 50మీటర్లలో ప్రమాదకర జోన్ లో ఆ మూడు స్పాట్లు ఉన్నాయని.. అక్కడ రోబోల సహాయంతో పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు.

ప్రమాదంలో గల్లంతైన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు కూడా ఆ జోన్ లో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా ముందుకెళుతున్నామన్నారు. రోబోలు సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో సొరంగం నుంచి బురద, మట్టిని దాని ద్వారా బయటకు పంపిస్తున్నామని..అలాగే నీళ్లను కూడా ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేస్తున్నామని తెలిపారు.

టీబీఎం మిషన్ కటింగ్ ..దాని వ్యర్థాల తరలింపు, డీవాటరింగ్ పనులు కొనసాగుతున్నాయని ఉత్తమ్ వివరించారు. చిన్న ఇటాచీ ద్వారా కూడా పనులు సాగుతున్నాయని తెలిపారు. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారని తెలిపారు.

Exit mobile version