స్నేహా ఉల్లాల్‌.. తక్కువేం కాదుగా!

విధాత‌: క్రియేటివ్‌ డైరెక్టర్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన స్నేహా ఉల్లాల్ జూనియర్‌ ఐశ్వర్యరాయ్‌లా కనిపించింది. ఆ మూవీలో అమాయకంగా కనిపించే ధనలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. 20-5లో హిందీ మూవీ లక్కీ: నో టైమ్‌ ఫర్‌ లవ్‌లో సల్మాన్‌ఖాన్‌ సరసన నటించిన ఆమె తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్నది అలా నేను మీకు తెలుసా.. కరెంట్, సింహా, వరుడు, అలా మొదలైంది, నాగార్జున హీరోగా వచ్చిన కింగ్‌లో నువ్వు రెడీ-నేను రెడీ […]

  • Publish Date - February 3, 2023 / 01:39 PM IST

విధాత‌: క్రియేటివ్‌ డైరెక్టర్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన స్నేహా ఉల్లాల్ జూనియర్‌ ఐశ్వర్యరాయ్‌లా కనిపించింది. ఆ మూవీలో అమాయకంగా కనిపించే ధనలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది.

20-5లో హిందీ మూవీ లక్కీ: నో టైమ్‌ ఫర్‌ లవ్‌లో సల్మాన్‌ఖాన్‌ సరసన నటించిన ఆమె తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్నది అలా నేను మీకు తెలుసా.. కరెంట్, సింహా, వరుడు, అలా మొదలైంది, నాగార్జున హీరోగా వచ్చిన కింగ్‌లో నువ్వు రెడీ-నేను రెడీ అనే పాటలో మెరిసిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.

కానీ సోషల్‌ మీడియా ఇన్‌స్టాలో తన ట్రావెల్‌ విశేషాలను, ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో కనిపించిన ఆ అమాయ‌క అమ్మాయేనా ఈమె అనేలా స్నేహా ఉల్లాల్‌ ఈ మధ్య బోల్డ్‌ ఫోటోలు, రీల్స్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నది.