Site icon vidhaatha

Sourav Ganguly Biopic | బిగ్‌ స్క్రీన్‌పై సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌..! దాదా పాత్ర ఎవరు పోషిస్తున్నారో తెలుసా..?

Sourav Ganguly Biopic | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ వెటరన్‌ క్రికెట్లర్ల బయోపిక్‌ తర్వాత.. దాదా బయోపిక్ రాబోతున్నది. గంగూలీ బయోపిక్‌ తీయనున్నట్టు చాలా కాలం క్రితమే ప్రకటించారు. లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న సినిమా స్క్రిప్ట్‌కు సౌరవ్ గంగూలీ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో దాదా రోల్‌ను ఎవరు పోషిస్తారనే చర్చ జరిగింది.

దాదాగా రణబీర్‌..

చిత్రానికి సంబంధిచిన స్క్రిప్ట్‌ను ఇటీవల గంగూలీ ముంబయిలో పరిశీలించి, ఆమోదముద్ర వేశారు. ‘దాదా’ జీవితంపై రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో కోల్‌కతాలో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో తెరపై సౌరవ్‌గా ఎవరు కనిపిస్తారన్న చర్చ జరుతున్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. రణబీర్‌ కపూర్‌ గంగూలీ పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితులు తెలిపారు. అయితే, తన బయోపిక్‌లో హీరోగా రణబీర్‌ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇది కాకుండా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. త్వరలోనే బయోపిక్‌ షూటింగ్‌ను కోల్‌కతాలో ప్రారంభించనున్నట్లు సమాచారం. సినిమాను రూ.250కోట్లతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రణబీర్‌ ‘యానిమల్‌’ చిత్రంలో నటిస్తుండగా.. షూటింగ్‌ శరవేగంగా నడుస్తున్నది.

Exit mobile version