Site icon vidhaatha

Bhadrachalam | 17న భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం

విధాత : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17న సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. 18వ తేదీన శ్రీ స్వామివారి పట్టాభిషేకం మహోత్సవం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఉత్సవాలను వీక్షించే భక్తుల కోసం కల్యాణోత్సవం, పట్టాభిషేకం టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

భక్తులకు శ్రీ స్వామివారి తలంబ్రాలు అందచేసేందుకు భద్రాచలం పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో 60కౌంటర్లు ఏర్పాటు చేసి 250క్వింటాళ్ల తలంబ్రాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయాలకు 19కౌంటర్లు ఏర్పాటు చేసి 2లక్షల 50వేల లడ్డూలు సిద్ధం చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. గోదావరి ఆఘగాడ్‌, విస్తా కాంప్లెక్స్‌ల వద్ద ఉచిత వసతి షెల్టర్లు ఏర్పాటు చేసినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది.

Exit mobile version