Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాకి కథే అవసరం లేదు.. రాజమౌళి తండ్రి చెప్పిన మాటే నిజమైంది!

Pawan kalyan పవన్ కళ్యాణ్ అనగానే యూత్‌లో ఓ డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌లో పండగే. ఓ రకంగా తనకంటూ ప్రత్యేకమైన బాణితో పాటు, స్టైల్ కూడా ఏర్పరుచుకుని ముందుకు దూసుకు పోతున్నాడు. కథ పరంగా సినిమా హిట్ కావడం, కాకపోవడం అనేవి ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా ఏం అవసరం లేదని అంటున్నాడు బాహుబలి రచయిత వి విజయేంద్రప్రసాద్. తాజాగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన […]

  • Publish Date - August 3, 2023 / 09:03 AM IST

Pawan kalyan

పవన్ కళ్యాణ్ అనగానే యూత్‌లో ఓ డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌లో పండగే. ఓ రకంగా తనకంటూ ప్రత్యేకమైన బాణితో పాటు, స్టైల్ కూడా ఏర్పరుచుకుని ముందుకు దూసుకు పోతున్నాడు. కథ పరంగా సినిమా హిట్ కావడం, కాకపోవడం అనేవి ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా ఏం అవసరం లేదని అంటున్నాడు బాహుబలి రచయిత వి విజయేంద్రప్రసాద్.

తాజాగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈ విషయాన్ని రుజువు చేసింది. మామూలు కథే అయినా బ్రో సినిమాను నిలబెట్టింది.. హిట్ వరకూ నడిపించింది పవన్ కళ్యాణ్ కున్న క్రేజే. అయితే పవన్ విషయంలో అతను చెప్పిన జోస్యమే నిజమైందని ఇప్పుడు చవులు కొరుక్కుంటు న్నారు జనం.

ఇంతకీ విషయం ఏంటంటే ఓ షోలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. పవన్ గురించి చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మామూలుగా చెప్పినా కథ అదే తీరుగా ఉండటం కలెక్షన్స్ అంతే రేంజ్ లో రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

అలీ హోస్ట్‌గా చేసిన ఓ షోకి విజయేంద్రప్రసాద్ అతిథిగా వెళ్ళాడు. అప్పుడు మాటల మధ్యలో పవన్ కళ్యాణ్‌ను హీరోగా అనుకుని కథ రాయాలంటే ఆ కథ ఎలా ఉండబోతుందో చెబుతారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన జవాబు చెప్పాడు.

పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేయాల్సిన అవసరం లేదని.. ఆయన కనిపిస్తేనే కథ హిట్ అవుతుందని, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి, రెండు రోజులకే 75 కోట్లు వసూలు చేస్తుంది అని చెప్పాడు. అదే సినిమా ప్లాప్ అయినా జనం పవన్ కళ్యాణ్ కోసం థియేటర్స్‌కి వస్తారని, అది ఆయన క్రేజ్ అనేలా కామెంట్స్ చేశాడు.

ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగానే ‘బ్రో’ సినిమా కథపరంగా అంత బలంగా లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసమే హిట్ కొట్టింది. కలెక్షన్స్ విషయంలోనూ అలాగే దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. చూస్తుంటే విజయేంద్ర ప్రసాద్ చెప్పిన జోస్యం నిజమైందనేలానే అనిపిస్తుంది.

ప్రస్తుతం పవన్ రాజకీయాలు, సినిమాల పరంగా చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ క్షణం ఓ చోట ఉన్న మనిషి మరుక్షణం మరో సభలో కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఆయన రాబోయే సినిమాల వర్క్ కూడా అంతే జోరుగా సాగుతుంది. ఉస్తాద్, OG రెండు సినిమాలు పోటీ పడి షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి.

Latest News