MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ..! ఊరట దక్కేనా..?

MLC Kavitha | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నది. కవిత పిటిషన్‌ నెంబర్‌ 36 కేసుగా లిస్ట్‌ అయ్యింది. జస్టిస్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ధర్మాసనం కవిత పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారం ఈడీ సమసన్లు జారీ చేయడాన్ని కవత సవాల్‌ చేశారు. సమన్లను రద్దు చేయడంతో పాటు మహిళను ఇంటి వద్దే విచారణ చేపట్టాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ […]

  • Publish Date - March 27, 2023 / 03:42 AM IST

MLC Kavitha | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నది. కవిత పిటిషన్‌ నెంబర్‌ 36 కేసుగా లిస్ట్‌ అయ్యింది. జస్టిస్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ధర్మాసనం కవిత పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారం ఈడీ సమసన్లు జారీ చేయడాన్ని కవత సవాల్‌ చేశారు. సమన్లను రద్దు చేయడంతో పాటు మహిళను ఇంటి వద్దే విచారణ చేపట్టాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పిటిషన్‌లో కవితను కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు.

మరో వైపు కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ సైతం కేవియట్‌ దాఖలు చేసిన విషయం విధితమే. కవిత పిటిషన్‌పై ఆదేశాలు ఇచ్చే సమయంలో తమ వాదనలు వినాలని ఈడీ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

విచారణపై స్టే ఇస్తందా? దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తుందా? మహిళ అనే కోణంలో ఇంటి వద్దే విచారించేలా ఏమైనా వెసులుబాటు కల్పిస్తుందా? లేదా? మరికొద్ది గంటల్లో తేలిపోనున్నది. సుప్రీంకోర్టు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏదో విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నెల 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని కవిత తరఫున న్యాయవాదులు కోరగా.. 27న జాబితా చేశామని, అదే రోజు విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు ఇప్పటి వరకు కవితను మూడసార్లు విచారించారు. దాదాపు 27 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. మరోసారి విచారణ ఉంటుందని ఈడీ అధికారులు సంకేతాలిచ్చారు. మూడురోజు విచారణ తర్వాత మళ్లీ విచారణ ఉంటే మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు సమాచారం ఇచ్చారు.

Latest News