MLC Kavitha | ఈడీ విచారణకు కవిత గైర్హాజరు.. మరో తేదీ నిర్ణయించాలని సూచన..

Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు గైర్హాజరయ్యారు. ఆరోగ్య సమస్యలు, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు రాలేకపోతున్నానని ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఈడీని కోరారు. అలాగే ఈడీ అడిగిన పలు పత్రాలను న్యాయవాది భరత్‌ ద్వారా ద్వారా పంపారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో గత శనివారం కవితను ఈడీ విచారించింది. […]

  • Publish Date - March 16, 2023 / 06:42 AM IST

Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు గైర్హాజరయ్యారు. ఆరోగ్య సమస్యలు, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు రాలేకపోతున్నానని ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తున్నది.

విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఈడీని కోరారు. అలాగే ఈడీ అడిగిన పలు పత్రాలను న్యాయవాది భరత్‌ ద్వారా ద్వారా పంపారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో గత శనివారం కవితను ఈడీ విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలకు విచారించింది.

ఆ తర్వాత 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కవిత బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈడీ విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జాబితా చేసేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ క్రమంలో ఈడీ విచారణకు హాజరవుతారని భావించినా.. ఇంతలోనే విచారణకు రాలేనని ఈడీకి పంపారు. మరి ఈడీ ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరో వైపు కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్‌ సైతం బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Latest News