Site icon vidhaatha

Telangana | మరో మూడు.. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ

Telangana |

విధాత: తెలంగాణ ప్రభుత్వం మరో మూడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.

డైరెక్టర్లుగా హైదరాబాద్ కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ్ పేట్ జిల్లా మద్దూర్ మండలం రెనెవట్ల కు చెందిన మొహమ్మద్ సలీం లను నియమించారు.

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని నియమించారు.

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్ ను నియమించారు.

Exit mobile version