JPS | పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులుగా జేపీఎస్‌లు..! 70 శాతం మార్కులు సాధిస్తేనే రెగ్యుల‌రైజ్..!!

JPS | తెలంగాణ వ్యాప్తంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నజూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు సంబంధించిన రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది. నాలుగేండ్ల స‌ర్వీసు పూర్తి చేసి, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్‌ల‌కు నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆదేశాల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 70 శాతం మార్కులు సాధించిన వారిని రెగ్యుల‌రైజ్ చేస్తూ గ్రేడ్ -4 పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులుగా నియామ‌క‌పు ప‌త్రాలు ఇవ్వాల‌ని సూచించింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు […]

  • Publish Date - August 9, 2023 / 12:58 AM IST

JPS | తెలంగాణ వ్యాప్తంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నజూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు సంబంధించిన రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది.

నాలుగేండ్ల స‌ర్వీసు పూర్తి చేసి, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్‌ల‌కు నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆదేశాల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

70 శాతం మార్కులు సాధించిన వారిని రెగ్యుల‌రైజ్ చేస్తూ గ్రేడ్ -4 పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులుగా నియామ‌క‌పు ప‌త్రాలు ఇవ్వాల‌ని సూచించింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పంచాయ‌తీరాజ్ శాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది.

త‌క్కువ స్కోర్ చేసిన వారి ప‌నితీరును 6 నెల‌ల పాటు ప‌రిశీలించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఇక జేపీఎస్‌ల ప‌నితీరు, ఇత‌ర వివ‌రాల‌ను యాప్‌లో న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. నియామ‌క ఉత్త‌ర్వుల‌ను కూడా న‌మోదు చేయాల‌ని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 9,355 మంది జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు ఉండ‌గా, ఇందులో 5,435 మంది కార్య‌ద‌ర్శులు నాలుగేండ్ల స‌ర్వీసును పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారికి మ‌రో నెల‌ల త‌ర్వాత స‌ర్వీసు పూర్త‌వుతుంది.

Latest News