NTR Statue | ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలు! అంద‌రిని పిలిచారు.. చిరంజీవి, మోహన్‌బాబులను వదిలేశారు

NTR Statue | విధాత‌: ఖమ్మంలో ఈనెల 28న ఆవిష్కృతం కానున్న ఎన్టీయార్ విగ్రహం (NTR Statue) చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. విగ్రహం కాస్తా వివాదమయింది. అసలా విగ్రహం నందమూరి తారక రాముడిదా, శ్రీకృష్ణుడిదా అనే సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. నందమూరి తారక రామారావు విగ్రహం చేయించాలనుకుంటే ఎన్టీయార్ ప్రతిరూపం చేయించాలి గానీ శ్రీకృష్ణుడి మాదిరిగా విగ్రహం చేయించడం ఏమిటన్న వాదన మొదలైంది. ఈమేరకు కరాటే కళ్యాణి అనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యురాలు వేసిన పిటిషన్ మీద […]

  • Publish Date - May 19, 2023 / 01:20 PM IST

NTR Statue |

విధాత‌: ఖమ్మంలో ఈనెల 28న ఆవిష్కృతం కానున్న ఎన్టీయార్ విగ్రహం (NTR Statue) చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. విగ్రహం కాస్తా వివాదమయింది. అసలా విగ్రహం నందమూరి తారక రాముడిదా, శ్రీకృష్ణుడిదా అనే సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. నందమూరి తారక రామారావు విగ్రహం చేయించాలనుకుంటే ఎన్టీయార్ ప్రతిరూపం చేయించాలి గానీ శ్రీకృష్ణుడి మాదిరిగా విగ్రహం చేయించడం ఏమిటన్న వాదన మొదలైంది.

ఈమేరకు కరాటే కళ్యాణి అనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యురాలు వేసిన పిటిషన్ మీద హైకోర్టు స్పందిస్తూ అందాకా చూద్దాం గానీ విగ్రహావిష్కరణ ఆపండని ఉత్తర్వులిచ్చింది.

ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహం ప్రతిష్టించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు అభిప్రాయాలకు, విమర్శలకు కారణం అయింది.

శ్రీ కృష్ణుడి రూపంలో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోబోమని కొందరు హెచ్చరిస్తున్నారు. అసలు జగన్నాధుడు అయిన శ్రీకృష్ణుడి రూపాన్ని ఎన్టీయార్‌కు ఇవ్వడం ఏమిటన్నది కొందరి విమర్శ.

ఇక ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీయార్‌ను సైతం పువ్వాడ అజయ్ ఆహ్వానించారు. అయితే ఇంతలోనే ఈ అంశం వివాదాస్పదం అయింది. కోర్టు కాస్తా ఆవిష్కరణను ఆపేయమని ఆదేశించింది. ఇక తరువాత జూనియర్ ఆ కార్యక్రమానికి వస్తారో రారో తెలియదు.

చిరంజీవికి మోహన్‌బాబుకు నో పిలుపు

ఇదిలా ఉండగా రేపు అంటే మే 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన దాదాపు అందరికీ ఆహ్వానాలు అందాయి. కానీ ఎన్టీయార్‌తో సాన్నిహిత్యం కలిగిన మోహన్‌బాబుకు, ఇంకా చిరంజీవికి మాత్రం పిలుపు రాలేదని తెలిసింది.

ఇక ఈ ఆహ్వాన కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్ సినిమా రంగంలోని నాగార్జున, బాలయ్య, వెంకటేష్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి అందరికీ పిలిచి చిరంజీవి, మోహన్ బాబులను ఇగ్నోర్ చేయడం చర్చకు దారి తీసింది.

చిరంజీవి ఇప్పటికే సీఎం వైయస్ జగన్‌తో సన్నిహితంగా ఉండడం ఒక కారణం కాగా మోహన్‌బాబుకు నోరు పెద్దది.. సభా వేదిక మీద ఎవర్ని ఏమంటారో తెలియదు. ఆయన స్టేజ్‌ ఎక్కినా తరువాత కొంపదీసి చంద్రబాబును సైతం తిట్టినా తిట్టొచ్చు. ఆ కారణంతోనే మోహన్ బాబును పిలవలేదని అంటున్నారు.

ఇక చిరంజీవి అటు జగన్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న నేపథ్యంలో ఆయన్ను పిలవలేదని అంటున్నారు. ఇంత వరకూ ఈ ఉత్సవాలకు ఎక్కడా పిలుపు అందుకోని జూనియర్ ఎన్టీయార్ సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. మరి ఆయన వస్తారో రారో తెలియదు.

Latest News