Temperature | 9 నుంచి దంచికొట్ట‌నున్న ఎండ‌లు..! హైద‌రాబాద్‌లో 40 డిగ్రీల‌కు పైనే..!!

Temperature విధాత‌: గ‌త రెండు వారాల నుంచి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో.. ఎండ‌లు త‌గ్గాయి. మ‌రో రెండు, మూడు రోజుల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి ఎండ‌లు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. హైద‌రాబాద్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. […]

  • Publish Date - May 7, 2023 / 12:15 PM IST

Temperature

విధాత‌: గ‌త రెండు వారాల నుంచి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో.. ఎండ‌లు త‌గ్గాయి. మ‌రో రెండు, మూడు రోజుల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

అయితే ఈ నెల 9వ తేదీ నుంచి ఎండ‌లు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. హైద‌రాబాద్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదయ్యే అవ‌కాశం ఉన్నందున వృద్ధులు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవ‌స‌ర‌మైతేనే ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇక రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు, వ‌రి, మామిడి పంట పూర్తిగా దెబ్బ‌తిన్న విష‌యం తెలిసిందే. భారీగా న‌ష్టం సంభ‌వించ‌డంతో రైతులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. తాము తీవ్రంగా న‌ష్టపోయామ‌ని మామిడి రైతులు కూడా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Latest News