" /> " /> " /> " />

Narsampet: వారిద్దరూ కవలలు.. ఒకే రోజు పెళ్లి.. ఒకే రోజు డెలివరీ| ఇద్దరికీ మగపిల్లలు – vidhaatha

Narsampet: వారిద్దరూ కవలలు.. ఒకే రోజు పెళ్లి.. ఒకే రోజు డెలివరీ| ఇద్దరికీ మగపిల్లలు

అప్పుడు కల్యాణ లక్ష్మి.. ఇప్పుడు KCR కిట్  దవాఖానకు వెళ్లి అందజేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వారిద్దరూ కవలలు.. ఒకే రోజు వివాహం చేసుకొన్నారు.. చివరికి ఒకేరోజు డెలివరీ అయ్యారు. విచిత్రం ఏమిటంటే ఇద్దరూ పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య, కొమరమ్మ లకు "లలిత-రమ" అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. సాధారణంగా కవల […]

  • Publish Date - March 31, 2023 / 08:11 AM IST
  • అప్పుడు కల్యాణ లక్ష్మి.. ఇప్పుడు KCR కిట్
  • దవాఖానకు వెళ్లి అందజేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వారిద్దరూ కవలలు.. ఒకే రోజు వివాహం చేసుకొన్నారు.. చివరికి ఒకేరోజు డెలివరీ అయ్యారు. విచిత్రం ఏమిటంటే ఇద్దరూ పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య, కొమరమ్మ లకు “లలిత-రమ” అనే ఇద్దరు కవల పిల్లలున్నారు.

సాధారణంగా కవల పిల్లలు జన్మిస్తే ఒకేసారి పెళ్లి చేయాలనేది సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఒకే వేదికగా ఇద్దరికీ వివాహం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇద్దరు గర్భం దాల్చారు. ఇద్దరు గురువారం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. ఇద్దరికీ పండంటి మగ బిడ్డలు జన్మించారు.

అప్పుడు కల్యాణ లక్ష్మి.. ఇప్పుడు కేసీఆర్ కిట్

కవలలు బొంత లలిత, రమ వివాహం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణం లక్ష్మి పథకం ద్వారా లబ్ది పొందారు. ఈ కళ్యాణ లక్ష్మీ చెక్కులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఒకేసారి చెక్కులను ఇరువురి కవలలకు అందజేశారు.

గురువారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు కవలలు ఒకేరోజు ప్రసవించి మగ పిల్లలకు జన్మనిచ్చారు. సమాచారం తెలిసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి, కేసీఆర్ కిట్ ను ఇరువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ మోడెం సాగర్, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.