Poland | పోలండ్‌లో సైనికుల భారీ క‌వాతు… బెలార‌స్‌పై యుద్ధానికి స‌న్నాహ‌మా?

Poland | విధాత‌: పోలండ్, బెలార‌స్‌ల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నట్లు తెలుస్తోంది. పోలండ్ మీద‌కు యుద్ధానికి సిద్ధమ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్రైవేటు సైన్యం ముఠా వాగ్న‌ర్ గ్రూప్‌… బెలార‌స్‌లో తిష్ఠ వేసింది. దీంతో త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని భావించిన పోలండ్.. సైనిక క‌వాతులు, యుద్ధ స‌న్నాహాలు ప్రారంభించింది. పొడ‌వైన ఆర్మీ వాహ‌న శ్రేణి పోలండ్ రాజ‌ధాని వార్సా (Warsaw )లో బారులు తీరిన‌ట్లు కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సుమారు 10 […]

  • Publish Date - August 15, 2023 / 07:34 AM IST

Poland | విధాత‌: పోలండ్, బెలార‌స్‌ల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నట్లు తెలుస్తోంది. పోలండ్ మీద‌కు యుద్ధానికి సిద్ధమ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్రైవేటు సైన్యం ముఠా వాగ్న‌ర్ గ్రూప్‌… బెలార‌స్‌లో తిష్ఠ వేసింది. దీంతో త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని భావించిన పోలండ్.. సైనిక క‌వాతులు, యుద్ధ స‌న్నాహాలు ప్రారంభించింది. పొడ‌వైన ఆర్మీ వాహ‌న శ్రేణి పోలండ్ రాజ‌ధాని వార్సా (Warsaw )లో బారులు తీరిన‌ట్లు కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సుమారు 10 వేల మంది సైనికుల‌ను బెలార‌స్ స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించిన‌ట్లు పోలండ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

ర‌ష్యా ( Russian) , దాని మిత్ర దేశం బెలార‌స్‌ (Belarus) ల‌కు త‌మ సైనిక పాట‌వాన్ని చూపేందుకు ఆర్మీడేను ఒక సంద‌ర్భంగా పోలండ్ ఎంచుకుంది. సుమారు మూడేళ్ల త‌ర్వాత అతి పెద్ద సైనిక క‌వాతు వార్సాలో మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. సుమారు 200 మిల‌ట‌రీ యూనిట్లు, 92 యుద్ధ విమానాలు, 2 వేల మంది సైనికులు, త్రివిధ ద‌ళాలు ఈ భారీ క‌వాతులో పాల్గొంటాయి. అమెరికా, ద‌.కొరియా ల నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఆయుధాల‌తో పాటు స్వ‌దేశీ ఆయుధాల‌నూ ఈ క‌వాతులో ప్ర‌ద‌ర్శిస్తామ‌ని పోలండ్ అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఉక్రెయిన్ మీద సైనిక చ‌ర్య‌కు దిగిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ (Putin)కు చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్‌, బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండర్ లుక‌షెంకో (Alexander Lukashenko)లు మాత్ర‌మే గ‌ట్టి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. అందువ‌ల్లే అమెరికా స‌హా నాటో దేశాల‌న్నీ లుక‌షెంకోపై ఆగ్ర‌హంగా ఉన్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన రెండు యుద్ధ హెలికాప్ట‌ర్‌లు పోలండ్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతే కాకుండా క్ర‌మం త‌ప్ప‌కుండా పోలండ్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేప‌డుతూ… బెలార‌స్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.

ఆదివారం రాయ్‌బ‌రేలీ (Rae Bareli)కి కుటుంబంతోస‌హా వ్యాపార‌వేత్త ఎస్‌యూవీలో బ‌య‌లు దేరారు. ఈ క్ర‌మంలో ఆలుమ‌గ‌ల మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్ వ్య‌వ‌హారంపై వాగ్వాదం మొద‌లైంది. కారును పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ హైవే వైపు మ‌ళ్లించాడు. వాగ్వాదం తీవ్రం కావ‌డంతో వాహ‌నాన్ని రోడ్డు ప‌క్క‌న నిలిపివేశాడు. వాగ్వాదం తీవ్ర‌రూపం దాల్చి కోపంతో భార్య‌ను చంపేశాడు. కారు వెనుక సీట్లో కూర్చున్న పిల్ల‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

హైవేపై అనుమానాస్ప‌దంగా కారు నిలిపి ఉండ‌టాన్ని పెట్రోలింగ్ పోలీసులు గ‌మ‌నించారు. అక్క‌డికి వెళ్లి చూడ‌గా, హ‌త్య విష‌యం వెలుగుచూసింది. పిల్ల‌లు వెక్కివెక్కి ఏడుస్తూ జ‌రిగిన విష‌యాన్ని పోలీసులకు వెల్ల‌డించారు. అనుమానం, అభ‌ద్ర‌తాభావంతో కోపం ప‌ట్ట‌లేక నిందితుడు భార్య‌ను చంపేసిన‌ట్టు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Latest News