Tiger | రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన వాహ‌నం.. కాళ్లు ఈడ్చుకుంటూ పొద‌ల్లోకి! హృదయ విదారక వీడియో

Tiger | వన్య‌ప్రాణులు సంచ‌రించే అడ‌వుల్లో వాహ‌నాలు కాస్త నెమ్మ‌దిగా వెళ్లాలి. లేదంటే మ‌న‌కైనా ప్ర‌మాదం సంభ‌వించొచ్చు. లేక వ‌న్య‌ప్రాణుల‌కైనా ప్ర‌మాదం జ‌ర‌గొచ్చు. పులి రోడ్డు దాటుతుండ‌గా వేగంగా వ‌చ్చిన వాహ‌నం ఢీకొట్టింది. దీంతో పులి రోడ్డుపైనే కాసేపు ఉండిపోయింది. న‌డ‌వ‌లేని ధీన‌ స్థితిలో ఉన్న ఆ పులి.. కాళ్ల‌ను ఈడ్చుకెంటూ చెట్ల పొద‌ల్లోకి వెళ్లింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర లోని గోండియా జిల్లా న‌వేగావ్ - నాగ్జీరా కారిడార్ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో గురువారం రాత్రి […]

  • Publish Date - August 11, 2023 / 11:53 AM IST

Tiger |

వన్య‌ప్రాణులు సంచ‌రించే అడ‌వుల్లో వాహ‌నాలు కాస్త నెమ్మ‌దిగా వెళ్లాలి. లేదంటే మ‌న‌కైనా ప్ర‌మాదం సంభ‌వించొచ్చు. లేక వ‌న్య‌ప్రాణుల‌కైనా ప్ర‌మాదం జ‌ర‌గొచ్చు. పులి రోడ్డు దాటుతుండ‌గా వేగంగా వ‌చ్చిన వాహ‌నం ఢీకొట్టింది. దీంతో పులి రోడ్డుపైనే కాసేపు ఉండిపోయింది.

న‌డ‌వ‌లేని ధీన‌ స్థితిలో ఉన్న ఆ పులి.. కాళ్ల‌ను ఈడ్చుకెంటూ చెట్ల పొద‌ల్లోకి వెళ్లింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర లోని గోండియా జిల్లా న‌వేగావ్ – నాగ్జీరా కారిడార్ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది.

అయితే రోడ్డుపై పులి క‌ద‌ల్లేని స్థితిలో ఉన్న విష‌యాన్ని వాహ‌న‌దారులు గ‌మ‌నించి, వాహ‌నాల‌ను ఆపారు. పులి రోడ్డుపై ప‌డి ఉన్న దృశ్యాల‌తో పాటు అడ‌విలోకి వెళ్లిన దృశ్యాల‌ను త‌మ ఫోన్ల‌లో రికార్డు చేసి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు. పులి దీన‌స్థితిని చూసి జంతు ప్రేమికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి ప్ర‌వీణ్ క‌శ్వాన్ తన ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రియ‌మైన స్నేహితులారా.. అభ‌యార‌ణ్యాల్లోని త‌మ ఆవాసాల్లో తిరిగే హ‌క్కు మొద‌ట వ‌న్య‌ప్రాణుల‌కే ఉంటుంది. కాబ‌ట్టి జాగ్ర‌త్తగా, త‌క్కువ వేగంతో ప్ర‌యాణించండి.

నాగ్జీరా వ‌ద్ద ఈ పులిని ఓ వాహ‌నం ఢీకొట్టింద‌ని క‌శ్వాన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ గాయ‌ప‌డిన పులిని గోరెవాడ‌లోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంట‌ర్‌కు త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించింద‌ని అధికారులు పేర్కొన్నారు.

Latest News