Adilabad | విహారయాత్రలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన ముగ్గురు మెడికల్‌ విద్యార్థులు

Adilabad వాగు ప్రవాహంలో కొట్టుకపోయిన ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు.. ఒకరు గల్లంతు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితులందరు కలిసి విహారయాత్రకు బయలుదేరిన ఘటనలో విషాదం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్జాన సంస్థ (రిమ్స్) కు చెందిన పది మంది మెడికల్ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా సరదాగ గడిపేందుకు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కుంభఝరి (శివఘాట్) గ్రామ శివారులోని కోటి లింగాలకు వెళ్ళారు. […]

  • Publish Date - August 7, 2023 / 12:45 AM IST

Adilabad

  • వాగు ప్రవాహంలో కొట్టుకపోయిన ముగ్గురు విద్యార్థులు
  • సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు.. ఒకరు గల్లంతు

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితులందరు కలిసి విహారయాత్రకు బయలుదేరిన ఘటనలో విషాదం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్జాన సంస్థ (రిమ్స్) కు చెందిన పది మంది మెడికల్ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా సరదాగ గడిపేందుకు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కుంభఝరి (శివఘాట్) గ్రామ శివారులోని కోటి లింగాలకు వెళ్ళారు.

అయితే పక్కనే ప్రవహిస్తున్న వాగు వద్దకు ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. వాగులో మొబైల్ పడిపోవడంతో దానిని వెతికె క్రమంలో ప్రవీణ్ తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు వాగులో కొట్టుకపోతున్న ఇద్దరు విద్యార్థులను కాపాడినప్పటికీ ప్రవీణ్ మాత్రం ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు.

తోటి స్నేహితులు అతడిని రక్షించేందుకు ఎంత ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. వాగులో గల్లంతైన విద్యార్థి ప్రవీణ్ స్వస్థతలం సిరిసిల్ల జిల్లా. ఈ సంఘటన విషయం తెలుసుకున్న మిగతా వైద్య విద్యార్థులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వాగులో గల్లంతైన వైద్య విద్యార్థి కోసం స్థానికులు, పోలీసులు కలిసి గాలింపును ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం గల్లంతైన విద్యార్థి మృత దేహం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా కుటుంబ సభ్యులు, తోటి స్నేహితుల రోదనలతో ఆసుపత్రి వాతావరణం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest News