Site icon vidhaatha

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

విధాత: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. పలువురు జిల్లా కలెక్టర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ మధ్యే ప్రభుత్వం 94 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మరో తొమ్మిది నెలలే గడువు ఉండడంతో ముందస్తుగా బదిలీలు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ కు జగిత్యాల జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా నిర్మల్ నుంచి బదిలీ అయిన ముషరాఫ్ అలీ కి పోస్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీ గా పనిచేస్తున్న క్రిస్టినా చోంగ్తు నుంచి పూర్తి అదనపు బాధ్యతల నుంచి తప్పించి భారతి హోలికేరిని నియమించారు.

ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
భారతి హోలికేరి మంచిర్యాల జిల్లా కలెక్టర్ మహిళా శాఖ స్పెషల్ సెక్రెటరీ
రాజీవ్ గాంధీ హన్మంతు హన్మకొండ జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్
డి.అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్
సిక్తా పట్నాయక్ అదిలాబాద్ జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్
రాహుల్ రాజ్ కుమ్రంభీమ్ జిల్లా కలెక్టర్ అదిలాబాద్ జిల్లా కలెక్టర్
నారాయణ రెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్
షేక్ యాస్మిన్ బాషా వనపర్తి జిల్లా కలెక్టర్ కుమ్రంభీమ్ జిల్లా కలెక్టర్
జి.రవి జగిత్యాల జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్
ఎస్.వెంకట్రావు సూర్యాపేట జిల్లా కలెక్టర్
ఎస్.హరీష్ రెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్
బదావత్ సంతోష్ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ మంచిర్యాల కలెక్టర్
రాజార్షి షా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్
తేజస్ నందలాల్ పవార్ మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ వనపర్తి జిల్లా కలెక్టర్
కర్నాటి వరుణ్ రెడ్డి ఉట్నూర్ ఐటిడిఏ పిఒ నిర్మల్ జిల్లా కలెక్టర్
Exit mobile version