Nalgonda | కల్తీ పాల దందా.. ఇద్దరి అరెస్టు

Nalgonda విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో కల్తీ పాల దందా వెలుగుచూసింది. భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల తయారీపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం భీమనపల్లి, కనుముక్కల గ్రామాల్లో కల్తీ పాల కేంద్రాలపై దాడులు చేశారు. కప్పల రవి, కుంభం రఘులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 450 లీటర్ల కల్తీ పాలు, 300 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 […]

  • Publish Date - September 20, 2023 / 09:27 AM IST

Nalgonda

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో కల్తీ పాల దందా వెలుగుచూసింది. భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల తయారీపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు.

బుధవారం భీమనపల్లి, కనుముక్కల గ్రామాల్లో కల్తీ పాల కేంద్రాలపై దాడులు చేశారు. కప్పల రవి, కుంభం రఘులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 450 లీటర్ల కల్తీ పాలు, 300 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 డోలోఫర్ స్కిన్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. కల్తీ పాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్ పంపినట్లు చెప్పారు. కాగా జిల్లాలో రోజురోజుకూ పాలదందా విస్తరిస్తోంది. పలుమార్లు అధికారులు, పోలీసులు దాడులు చేసి, అరెస్టులకు పాల్పడుతున్నా అక్రమార్కుల వక్రబుద్ధితో వివిధ రూపాల్లో కల్తీపాల దందాను కొనసాగిస్తున్నారు