IndiGo | గాల్లో ఉండ‌గా విఫ‌ల‌మైన ఇంజిన్లు.. ఒకే రోజు రెండు విమానాల్లో ఘ‌ట‌న‌లు

మ‌రో సారి చ‌ర్చనీయాంశ‌మైన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ IndiGo | విధాత‌: పొదుపు చ‌ర్య‌ల‌తో ప్ర‌మాద‌క‌ర ప్ర‌క్రియ‌ల‌ను అవ‌లంబిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇండిగో (Indigo) ఎయిర్‌లైన్స్ మ‌రో సారి చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఆ సంస్థ‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఉండ‌గానే ఇంజిన్ ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాయ‌ని తెలుస్తోంది. మ‌దురై నుంచి ముంబ‌యి వస్తున్న విమానం ప్ర‌యాణంలో ఉండ‌గా.. ఇంజిన్ ప‌నిచేయ‌డం (Engine Shut Down) మానేసింది. ఆ త‌ర్వాత కొన్ని గంట‌ల‌కే రెండో ఘ‌ట‌న‌లో కోల్‌క‌తా నుంచి […]

  • Publish Date - August 30, 2023 / 12:14 PM IST

  • మ‌రో సారి చ‌ర్చనీయాంశ‌మైన ఇండిగో ఎయిర్‌లైన్స్‌

IndiGo | విధాత‌: పొదుపు చ‌ర్య‌ల‌తో ప్ర‌మాద‌క‌ర ప్ర‌క్రియ‌ల‌ను అవ‌లంబిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇండిగో (Indigo) ఎయిర్‌లైన్స్ మ‌రో సారి చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఆ సంస్థ‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఉండ‌గానే ఇంజిన్ ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాయ‌ని తెలుస్తోంది. మ‌దురై నుంచి ముంబ‌యి వస్తున్న విమానం ప్ర‌యాణంలో ఉండ‌గా.. ఇంజిన్ ప‌నిచేయ‌డం (Engine Shut Down) మానేసింది.

ఆ త‌ర్వాత కొన్ని గంట‌ల‌కే రెండో ఘ‌ట‌న‌లో కోల్‌క‌తా నుంచి బెంగ‌ళూరు వ‌స్తున్న విమానంలో ఇంజిన్లు రెండూ ఆగిపోయాయి. అయితే రెండు విమానాలూ క్షేమంగా ల్యాండ్ కావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఒక ఇంజిన్ ప‌నిచేయ‌క‌పోగా.. మ‌రో ఇంజిన్‌లో ఆయిల్ చిప్ హెచ్చ‌రిక వ‌చ్చింద‌ని.. దానిని పైల‌ట్ స‌రి క్షేమంగా ల్యాండ్ చేశార‌ని ఇండిగో త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ముంబ‌యికి వెళ్లిన విమానం గురించి కూడా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ముంబ‌యిలో ల్యాండ్ అయిన అనంత‌రం విమానాన్ని స‌ర్వీసింగ్‌కు పంపించామ‌ని తెలిపింది. ఇరు విమానాల్లోని ప్ర‌యాణికుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఈ నెల తొలి వారంలో కాసేప‌ట్లో విమానాన్ని న‌డ‌ప‌నున్న ఇండిగో పైల‌ట్ బోర్డింగ్ గేట్ ద‌గ్గ‌ర కుప్ప‌కూలిపోయిన ఘ‌ట‌న నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

సుమారు 6 కేజీల ఇంధ‌నాన్ని పొదుపు చేయ‌డానికి ల్యాండింగ్ స‌మ‌యంలో ప్ర‌మాద‌క‌ర ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల్సిందిగా పైల‌ట్‌ల‌కు ఇండిగో సూచించిన‌ట్లు కొన్ని రోజుల క్రితం ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. రెక్క‌ల‌కు ఉండే ఫ్లాప్స్‌ను కొన్ని డిగ్రీలు మార్చ‌డం ద్వారా ఇంధ‌నం ఆదా అవుతుంది. కాక‌పోతే ల్యాండ్ అయేట‌ప్పుడు విమానం రెక్క నేల‌ను రాసుకునే ప్ర‌మాదం ఉంటుంది. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పెరిగిపోయి వార్త‌లు రావ‌డంతో ఇండిగో తన ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకున్న‌ట్లు స‌మాచారం.

Latest News