Site icon vidhaatha

Uppal Bharat Petrol Pump Fraud: ఉప్పల్ భారత్ పెట్రోల్ పుంప్ మోసాలు..నిలదీసిన జనం!

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు వినియోగదారులను మోసగిస్తున్న తీరు బట్టబయలైంది. వాహనదారులు చెల్లించిన డబ్బులకంటే తక్కువ పెట్రోల్ ను పోస్తున్న బంక్ నిర్వాహకుల మోసాన్ని ఓ యువకుడు బహిర్గతం చేశాడు. దీంతో వాహనాదారులు మోసం చేస్తున్న తీరుపై బంక్ నిర్వాహకులపై వాగ్వివాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉప్పల్ పరిధిలో మైసూర్ హోటల్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపులో రూ.100 రూపాయల పెట్రోల్‌ను ఓ యువకుడు బాటిల్‌లో కొట్టించాడు. అయితే రూ.100 రూపాయలకు రావాల్సిన దానికంటే తక్కువ పెట్రోల్ రావడంతో ఆ యువకుడు బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. అంతే వస్తుంది అని బంక్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. అదే బంక్ లో మరో బాటిల్ లో రూ.100 కొట్టించగా అంతకుముందు వచ్చిన బాటిల్ లో కంటే పెట్రో ల్ ఎక్కువ వచ్చింది.

ఆ రెండు బాటిళ్లలోని పెట్రోల్ మధ్య తేడాలను చూపుతు బాధిత యువకుడు సహా, వాహనాదారులు బంక్ యాజమాన్యాన్ని నిలదీశారు. మీటర్‌లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారని వాహనాదారులు మండిపడ్డారు. దీనిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Exit mobile version