UPSC | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2023 ఫ‌లితాలు విడుద‌ల‌

UPSC విధాత‌: యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ - 2023 ఫ‌లితాలు సోమ‌వారం విడుద‌ల‌య్యాయి. ఈ ఏడాది మే 28న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించింది యూపీఎస్సీ. కాగా 16 రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో 14,624 మంది అభ్య‌ర్థులు మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు. ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులంద‌రూ.. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 నుంచి నిర్వ‌హించ‌బోయే మెయిన్స్ ఎగ్జామ్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని యూపీఎస్సీ సూచించింది. […]

  • Publish Date - June 12, 2023 / 09:58 AM IST

UPSC

విధాత‌: యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ – 2023 ఫ‌లితాలు సోమ‌వారం విడుద‌ల‌య్యాయి. ఈ ఏడాది మే 28న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించింది యూపీఎస్సీ. కాగా 16 రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

ఈ ఫ‌లితాల్లో 14,624 మంది అభ్య‌ర్థులు మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు. ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులంద‌రూ.. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 నుంచి నిర్వ‌హించ‌బోయే మెయిన్స్ ఎగ్జామ్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని యూపీఎస్సీ సూచించింది. మెయిన్స్ ప‌రీక్ష‌ల కోసం డీఏఎఫ్ -1లో దరఖాస్తు చేసుకోవాల‌ని తెలిపింది.

ప్రిలిమ్స్ ఫ‌లితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.upsc.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వొచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ త‌దిత‌ర స‌ర్వీసులకు ఉద్యోగుల‌ను యూపీఎస్సీ ప్ర‌తి ఏడాది ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Latest News