- ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం
- 17,32,171 మంది పిల్లలకు పోలియో చుక్కలు
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ
హైదరాబాద్, అక్టోబర్ 12(విధాత): పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్రంలోని ఆరు జిల్లాలలో నిర్వహిస్తున్నామనీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ తెలియజేశారు. ఆదివారం వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 0-5 సంవత్సరముల లోపు పిల్లలు 17,32,171 మంది పిల్లలకు పోలియో చుక్కల మందును వేస్తున్నామని, ఇందుకోసం 6897 బూతులు ఏర్పాటు చేశామని తెలియజేశారు.
ఆదివారం పోలియో బూత్ లలో పోలియో మందును 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు వేశామని అన్నారు. ఎవరైనా పిల్లలు పోలియో బూత్ లలో తీసుకొని వారు ఉంటే వారికి 13,14 తేదీలలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కల మందులు వేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 15 తేదీన కూడా ఇంటింటికి వెళ్లి పోలియో మందు వేస్తారని అన్నారు.
ఆరు జిల్లాలలో 259 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని,138 ట్రాన్సిట్ పాయింట్స్ ,576 రూట్ సూపర్వైజర్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9110 మహిళా ఆరోగ్య కార్యకర్తలు (ఎంపీహెచ్‌ఏ) 6705 ఆశా కార్యకర్తలు, 6574 అంగన్వాడి కార్యకర్తలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 19,10,400 డోసుల పోలియో వ్యాక్సిన్ ను జిల్లాలకు పంపిణీ చేశామని సంగీత సత్యనారాయణ తెలిపారు.