Site icon vidhaatha

Venkaiah Naidu | పాక ఇడ్లీ తిన్న వెంకయ్య నాయుడు

విధాత‌: ఈ రోజు ఉదయం విజ‌య‌వాడ‌లోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ హోట‌ల్ (పాక ఇడ్లీ)లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) టిఫిన్ చేశారు. ఈ ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు (Kamineni Srinivas Rao)తో‌ కలిసి వెంకయ్య నాయుడు చక్కటి నేతి ఇడ్లీని ఆస్వాదించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందన్నారు. పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమని, గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని గుర్తుచేశారు.

గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌, ఆయన సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు. ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని తెలిపారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Exit mobile version