Site icon vidhaatha

Virat Kohli | పిలిచి మ‌రీ సెల్ఫీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. షాకైన అభిమాని

Virat Kohli |

టీమిండియా అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన గ్రౌండ్‌లో ఉంటే హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో మ‌నం చాలా సార్లు చూశాం. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కే కాదు ఆయ‌న చేసే సంద‌డి కోసం కూడా చాలా మంది వీక్ష‌కులు గ్రౌండ్‌కి వ‌స్తుంటారు. ఇక విరాట్ బ‌య‌ట క‌నిపిస్తే ఆయ‌న‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బ‌డుతుంటారు.

అయితే చాలా సార్లు విరాట్ త‌న ఫ్యాన్స్‌కి సెల్ఫీ ఇచ్చి సంతోష‌పెట్టారు. సెల్ఫీ ఇచ్చే విష‌యంలో విరాట్ ఏ మాత్రం చిరాకుప‌డ‌డు. తాజాగా విరాట్ కోహ్లీని ఓ అభిమాని సెల్పీ అడ‌గ‌గా పిలిచి మ‌రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

విండీస్ టూర్ త‌ర్వాత ముంబై వచ్చేసిన కోహ్లీ.. మినీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా విజయానికి కోహ్లీ చాలా కీలకం కానున్న నేప‌థ్యంలో అత‌నికి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ క్ర‌మంలో వెకేష‌న్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే కోహ్లీ ఓ ప్ర‌దేశం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంటే ఓ అభిమాని దూరం నుండే కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించాడు. అప్పుడు అది గ‌మ‌నించిన కోహ్లీ ద‌గ్గ‌ర‌కు పిలిచి సెల్ఫీ దిగి పంపించాడు. కోహ్లీ చేసిన పనికి ఆ ఫ్యాన్ ఆనందం అంతా ఇంతాకాదు. ఫ్యాన్ ముఖం చూస్తేనే ఆయ‌న ఎంత సంతోషించాడో అర్ధ‌మవుతుంది.

ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, కోహ్లీ మ‌రోసారి త‌న గొప్ప వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నాడ‌ని చెబుతున్నారు. చాలా మంది సెలబ్రెటీలు పిలిచి ఫోటోలు ఇవ్వడానికి అంత అంగీక‌రించారు. కాని కోహ్లీ రూట్ స‌ప‌రేట్.

కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో స‌త‌మవుతున్న కోహ్లీకి అభిమానులు చాలా అండ‌గా నిలిచారు. త‌క్కువ స్కోర్ చేసిన ప్ర‌తిసారి కూడా వారే ధైర్య‌మిచ్చారు. అందుకే కోహ్లీకి అభిమానులు అంటే ప్రత్యేక‌మైన గౌరవం ఉంటుంది. వారికోసం ఏం చేయ‌డానికైన కూడా సిద్ధంగా ఉంటారు.

Exit mobile version