Site icon vidhaatha

Vishnu Priya: హైకోర్టులో.. విష్ణు ప్రియకు ఎదురుదెబ్బ‌!

Betting Apps Case :

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించిన నటి విష్టుప్రియకు చుక్కెదురైంది. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయడానికి, దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. నటి, యాంకర్, వైసీపీ నేత శ్యామల సైతం ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించగా..ఆమెకు కూడా కోర్టు ఇదే రీతిలో దర్యాప్తు సహకరించాలని ఆదేశాలిచ్చింది.

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ కేసులో పంజాగుట్టలో, మియాపూర్‌ పీఎస్‌లో విష్ణు ప్రియ సహా పలువురు ఇన్ ఫ్లుయెన్సర్ల పైన, టాలీవుడు సినీ నటీ, నటులపైన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఓ పర్యాయం పంజాగుట్ట పోలీసుల విచారణకు విష్ణుప్రియ హాజరైంది. కాగా బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఆయా కేసులన్ని ఇక మీదట సిట్ పరిధిలోకి వెళ్లనున్నాయి. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 900మందికి పైగా బలవన్మరణాల పాలయ్యారు. బెట్టింగ్ యాప్స్ మోసాలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11మంది ప్రమోటర్లపైన, యాజమానులపైన, మియాపూర్ లో 25మంది పైన కేసులు నమోదు చేసింది. అటు సైబర్ క్రైమ్ విభాగం సైతం యాప్ లను బ్యాన్ చేస్తు చర్యలు చేపట్టింది.

Exit mobile version