Site icon vidhaatha

Anand Mahindra | టాలెంట్‌తో ఆనంద్‌ మహీంద్రానే ఫిదా చేసిన వెయిటర్‌..!

Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఆయన.. సమాజానికి సైతం కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్విట్టర్‌ వేదికగా పలు విషయాలు, వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఆలోచింపజేస్తుంటారు. అలాగే టాలెంట్‌ను సైతం మెచ్చుకుంటారు. తాజాగా ఓ హోటల్‌లో వెయిటర్‌ అసాధారణ ప్రతిభను ఆయన ప్రశంసిస్తూ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వెయిటర్‌ ఒకేసారి 13దోశ ప్లేట్లను తీసుకెళ్లడం కనిపిస్తున్నది.

ఆ వ్యక్తి ఒలింపిక్ పోటీలకు వెళ్లి ఉంటే కచ్చితంగా బంగారు పతకానికి పోటీదారుగా నిలిచేవాడని బిజినెస్‌ టైకూన్‌ ట్వీట్‌ చేశారు. ‘వెయిటర్ పనివిధానాన్ని ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తే.. అతడు బంగారు పతకానికి పోటీదారుడిగా ఉండేవాడు’ అంటూ ప్రశంసిస్తూ.. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశార. అయితే, వీడియోను ఓ రెస్టారెంట్‌లో తీయగా.. ఆ వీడియో ప్రారంభంలో రెస్టారెంట్ కిచెన్‌లో దోసెలు వేయడం కనిపిస్తుంది. అనంతరం వెయిటర్‌ ఒక్కో దోశ ప్లేట్‌ను తీసుకుంటూ నైపుణ్యంతో ఒకే చేయిపై బ్యాలెన్స్‌ చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత హోటల్‌ల్‌ ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తులందరికీ ఒక్కొక్కటిగా ఇవ్వడం కనిపించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఇంకెదుకు మీరూ ఓసారి ఆ వీడియోను చూసేయండి మరి..!

Exit mobile version