Site icon vidhaatha

Warangal: MGM పోస్ట్ మార్టం సిబ్బంది నిర్లక్ష్యం.. తారుమారైన మృతదేహాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్(MGM Hospital) పోస్ట్ మార్టం(Post Mortem..)లో మృతదేహం తారుమారైన సంఘటన శనివారం జరిగింది. ఇచ్చింది తమ మృతదేహం కాదని బంధువులు ఆందోళన వ్యక్తం చేయడంతో జరిగిన పొరపాటున గుర్తించి తిరిగి వారి బంధువు మృతదేహాన్ని వారికి అప్పగించిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లికి చెందిన రాగుల రమేష్ శుక్రవారం సాయంత్రం కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. మృతి చెందిన అనంతరం వైద్యులు పోస్ట్ మార్టం కోసం పంపించారు. రమేష్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం చేసిన సిబ్బంది రమేష్ మృతదేహానికి బదులు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పోస్ట్ మార్టం చేసిన పరమేశ్వర్ మృతదేహాన్ని రమేష్ బంధువులకు అప్పగించారు.

మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయిన రమేష్ బంధువులు అదే మృతదేహంతో పోస్ట్ మార్టం వద్ద ఆందోళన చేయగా వెంటనే తేరుకున్న సిబ్బంది విషయం బయటకు రాకుండా రమేశ్ మృతదేహం రమేష్ బంధువులకు అప్పగించారు. ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పోస్ట్ మార్టం సిబ్బంది అలసత్వాన్ని విమర్శించారు.

Exit mobile version