విధాత, వరంగల్ :
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సింగ్ యువతిపై కొందరు యువకులు యాసిడ్ దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..పట్టణంలోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి (21) ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై సోమవారం గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్ ఘడ్ మండలం వెంకటాపురం గ్రామం అని తెలుస్తోంది. హాల్‌టికెట్ నిమిత్తం కాలేజీకి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పై కాజీపేట ఏసీపీ, పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు.
