నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లునల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు

నల్ల దుస్తులు ధరించి కెఎంసీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఎంజీఎం వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ నెల 24 నుండి జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్దమయ్యారు.

  • Publish Date - June 21, 2024 / 05:03 PM IST

జూన్ 24 నుండి సమ్మెకు సిద్దమైన కెఎంసీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు

– సమస్యలు తీరెంత వరకు సమ్మెను విరమించం
– సమ్మె నోటీసు విడుదల చేసిన జూనియర్ డాక్టర్లు
– అత్యవసర సేవలు మినహా ఎంజీఎం లో అన్ని సేవలకు దూరంగా ఉండి నిరసన చేస్తున్నట్లు వెల్లడి

విధాత, వరంగల్ ప్రతినిధి:నల్ల దుస్తులు ధరించి కెఎంసీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఎంజీఎం వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ నెల 24 నుండి జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్దమయ్యారు.
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు తీరెంత వరకు సమ్మెను విరమించమని స్పష్టంగా ప్రకటించారు.
ఈ మేరకు జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసు విడుదల చేశారు. అత్యవసర సేవలు మినహా ఎంజీఎంలో అన్ని సేవలకు దూరంగా ఉండి నిరసన చేస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లు ఇలా ఉన్నాయి.
స్టైపెండ్‌ల సకాలంలో విడుదల కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు, కాకతీయ వైద్య కళాశాలలో రోడ్ల నిర్మాణం, డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ప్రకటన, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతా సమస్యలకు పరిష్కారం, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సరిపడా మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం కొత్త భవన నిర్మాణం, యుజీ ప్రాస్పెక్టస్ కోసం నీట్ లో 15% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ స్పందించినందున సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సంబంధిత అధికారుల నుంచి సరైన చర్యలు లేకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్‌లన్నింటినీ పూర్తిగా పరిష్కరించని పక్షంలో సమ్మెను 24వ తేదీ నుండి ప్రారంభించి, నిరవధికంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.

**

Latest News