Site icon vidhaatha

Warangal | ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు..?: బీజేపీ నేత శ్రీ‌ధ‌ర్‌

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహా జన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడనికి వివిధ మోర్చాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులతో భాగంగా బుధవారం భారతీయ జనతా యువ మోర్చా జిల్లా వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు గోదాసి చిన్న ఆధ్వర్యంలో వరంగల్లో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

కాశీబుగ్గ జంక్షన్ నుంచి పోచంమైదాన్, ఎంజీఎం సర్కిల్, బట్టల బజార్ మీదుగా ఖిలా వరంగల్ లోని కుష్మహల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ర్యాలీలో తూర్పు నియోజకవర్గ నేత గంట రవికుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పరిపాలనలో దేశం కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో కేంద్ర వాటా ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంతా తామే చేస్తున్నామని షోలు చేస్తోందని మండిపడ్డారు.

నిరుద్యోగం కనిపించడం లేదా..?

దశాబ్ది ఉత్సవాల పేరా.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని స్థితిలో ఉందని గంట రవికుమార్ మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాడి తెలంగాణ సాధించుకున్న యువత మాత్రం నేడు రోడ్లపైనే ఉద్యోగాల కోసం తిరుగుతున్నారన్నారు.

సంపన్న తెలంగాణను అప్పుల పాలు చేశామని సంబురాలు చేసుకుంటున్నారా..? లేక యువత ఉద్యోగం లేక ఆగమవుతుంటే ఉత్సవాలు చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు,కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, పిట్టల కిరణ్,జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మరియు బీజేయం నాయకులు , బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version